బాజీరావ్ మస్తానీ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్‌సింగ్, దీపికాపదుకొనె జంటగా రూపొంది సంచలనం సృష్టించిన ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా పదవ ఏషియన్ ఫిల్మ్ అవార్డుల రేసులో రెండోస్థానంలో ఉంది. ఉత్తమచిత్రం విభాగంతోసహా ఐదు అవార్డులకోసం నామినేషన్‌కు అర్హత సాధించింది. హిసియో-హిసిన్ కుంగ్‌ఫుమాస్టర్‌పీస్ ‘ది ఎసాసిన్’ 9 విభాగాల్లో నామినేషన్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా ఉత్తమచిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ నటి (షు కి) విభాగాలతో సహా 9 అవార్డులకోసం నామినేషన్‌కు అర్హత సాధించింది. ఇక పోలీస్ థ్రిల్లర్ ‘పోర్ట్ ఆఫ్ కాల్’ ‘బాజీరావ్ మస్తానీ’తో సమంగా రెండోస్థానంలో నిలిచింది. ఉత్తమ ఎడిటింగ్ (రాజేశ్‌పాండే), ఉత్తమ సంగీతం (నిహార్ రంజన్ సమల్), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ (ప్రసాద్ సుతర్), డిజైనర్ అంజుమోడి, మాక్సిబ బసు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాల్లో బాజీరావ్ మస్తానీ నామినేషన్‌లకు అర్హత సాధించింది. ఇక ఎస్‌ఎస్ రాజవౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘బాహుబలి’ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ (శ్రీనివాస్ మోహన్) విభాగంలో నామినేషన్ సాధించింది. ‘బాంబేవెల్వెట్’ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో నామినేషన్‌కు అర్హత సాధించగా ప్రధాన విభాగాలైన ఉత్తమ నటుడు, ఉత్తమనటి విభాగాలతో సహా నాలుగు అవార్డులకోసం జరిగే పోటీలో భారతీయ నటులు ఎవరూ లేరు. కాగా 2007నుంచి ఏషియన్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది 9 ఏషియన్ దేశాలనుంచి 36 సినిమాలు అవార్డులకోసం పోటీపడుతున్నాయి. మకావూలో మార్చి 17న అట్టహాసంగా జరిగే వేడుకల్లో అవార్డులను ప్రదానం చేస్తారు.