థ్రిల్ కలిగించే శ్రీవల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులతో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్‌పై ‘శ్రీవల్లీ’ చిత్రాన్ని నిర్మించారు రాజ్‌కుమార్, సునీత. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలు చెప్పిన విశేషాలు..
సైన్స్ ఫిక్షన్
శ్రీవల్లీ అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఓ శాస్తవ్రేత్త చేసిన ప్రయోగంవల్ల ఆమెకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో జరిగిన అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుంది. ప్రతీక్షణం మలుపులతో ఆకట్టుకునే చిత్రమిది. విజయేంద్రప్రసాద్ అద్భుతంగా తెరకెక్కించారు.
అలా కుదిరింది
సినిమాలంటే ఆసక్తి వుండడంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చాం. విజయేంద్రప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ఈ కథను చెప్పారు. కథ బాగా నచ్చడంతో ఆయనే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి మొదటి సినిమాకే దర్శకత్వం వహించడం ఆనందంగా వుంది. నిర్మాతగా తొలి సినిమాతోనే మంచి ప్రాజెక్టు చేయడం మర్చిపోలేని అనుభూతి.
తొలి ప్రయత్నం
ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగు తెరపై రాలేదనే చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కానె్సప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలో 40 నిమిషాల గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. ఇప్పటికే సినిమా గురించి తెలిసిన చాలామంది ప్రముఖులు బావుందని అభినందిస్తున్నారు. ఈ చిత్రానికి పలువురు ప్రముఖులు సపోర్టు అందించడం ఆనందంగా వుంది.
సుకుమార్ బ్యానర్‌లో
తదుపరి చిత్రంగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా ‘కుమారి 21 ఎఫ్’ టీమ్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. భవిష్యత్తులో పవన్‌కళ్యాణ్ సినిమా చేయాలన్నది మా కల.

-శ్రీ