కొత్త ప్లానుతో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ 150వ చిత్రంగా వచ్చిన ‘ఖైదీ నెం బర్ 150’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిం చి, మెగాస్టార్‌కు మంచి కమ్‌బ్యాక్ ఫిలింగా నిలిచింది. ఆ సినిమాతో దర్శకుడిగా మెగా ఇమేజ్‌ని అందుకున్నాడు వి.వి వినాయక్. ఆ చిత్రం విడుదలై చాలా రోజులు అవుతున్నా కూడా వినాయక్ ఇంకా తన తదుపరి చిత్రం మొదలుపెట్టలేదు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దాంతోపాటు ఆయన ఎన్‌టిఆర్‌తో మరో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడట. అయితే ఈసారి సేఫ్ జోన్‌లో ఉండేలా ‘అదుర్స్’ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. ఆ మధ్య వచ్చిన ‘అదుర్స్’ ఎన్‌టిఆర్‌కు మంచి విజయాన్ని అందించింది. పైగా రెండు వేరియేషన్ వున్న పాత్రల్లో ఎన్‌టిఆర్ అదరగొట్టాడు. ఇప్పుడు సినిమా సీక్వెల్ చేయడమే బెటర్ అని భావించిన వినాయక్, దానికోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం కోసం స్టార్ రైటర్ కోన వెంకట్ రం గంలోకి దిగాడట. ప్రస్తు తం ‘టెంపర్’, ‘నాన్న కు ప్రేమతో..’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో ఎన్‌టిఆర్ ఫోకస్ మారింది. మరి ఈ సమయంలో వినాయక్ ఆఫర్‌కి ఓకే అంటాడా లేదా అనేది తెలియాల్సి వుంది. అంటేమాత్రం మరోసినిమా అదుర్స్ అంటు వస్తుందన్నమాట!