బిజీ లైఫ్ ఇష్టం: మెహ్రీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత సంవత్సరం ఒకే ఒక్క సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది మెహ్రీన్. అప్పటి నుంచి మరో సినిమా విడుదల కాలేదు. అలాగని అవకాశాల్లేవని కాదు, వరసబెట్టి సినిమాల్లో అవకాశాలు అందుకుంటూనే వుంది. కానీ సినిమాలే విడుదల కాలేదు. ప్రస్తుతం ఆమె సాయిధరమ్ తేజతో ‘జవాన్’ చిత్రంలో నటిస్తస్తోంది. ‘రాజా ది గ్రేట్’లో రవితేజ సరసన కథానాయికగా కనిపిస్తుంది. ‘మహానుభావుడు’ చిత్రంలో శర్వానంద్‌తో జోడీకట్టింది. ఈ సినిమా దసరా పండుగకే విడుదల కానున్నది. ఓ వైపు షూటింగ్, మరో వైపు కొత్తగా విడుదలవుతున్న సినిమాల ప్రమోషన్ల గజిబిజితో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది మెహ్రీన్. ఈ విషయం గురించే అడిగితే- ఈ సంవత్సరం తాను చాలా బిజీగా గడిపేసానని, ఇలా క్షణం తీరిక లేకుండా వుండడమే తనకిష్టమని చెబుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన సినిమాలు మూడు విడుదలకు సిద్ధమయ్యాయి. తొలి హిట్ అందుకున్న ఈ అమ్మడికి మలి హిట్ ఏ చిత్రంతో లభిస్తుందో చూడాలి మరి!