మరో జీవితకథలో...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్‌లో రియల్ స్టోరీలు, బయోపిక్‌లకు మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ తరహా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నాయి. దాంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా రూపొందిస్తున్నారు. ధోని, అజారుద్దీన్‌ల జీవిత కథల సినిమాలు సెట్స్‌పై వున్నాయి. తాజాగా మరో బయోపిక్ సెట్స్‌పైకి రానుంది. హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సైనా నెహ్వాల్ జీవిత కథతో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ గ్లామర్ భామ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోందని తెలిసింది. అమోల్ గుప్తా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాడట. ఇందులో నటించేందుకు దీపికాతో జరిపిన చర్చలు ఫలించాయని తెలిసింది. సైనా నెహ్వాల్ తన ఫ్రెండేనని చెప్పుకొచ్చిందట దీపిక. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.