గల్ఫ్ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే జంటగా శ్రావ్య ఫిలిం పతాకంపై సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఎక్కలి రవీంద్రబాబు ఎమ్మెస్ రామ్‌కుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘గల్ఫ్’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు సినిమాకు యు/ఎ సర్ట్ఫికెట్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రవాస భారతీయుల కడగండ్లు గల్ఫ్‌లో నివశిస్తున్న వారి బాధలను కళ్లకు కట్టినట్టుగా ఈ చిత్రంలో చూపామని తెలిపారు. ప్రజల హృదయాలకు హత్తుకునే సంఘటనలు సినిమాలో వున్నాయని గల్ఫ్ కార్మికుల కోసం ఈ చిత్రంలో అనేక సంఘటనలు దర్శకుడు రూపొందించారని రాయలసీమ, తెలంగాణ ప్రజలకు ఈ సినిమా నచ్చుతుందని వారన్నారు. ప్రచార చిత్రాలను, పాటలను ఇప్పటికే విడుదల చేసామని, సామాజిక సమస్యలను వెండితెరపై వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించే దర్శకుడు ఈ సినిమా కోసం ప్రవాసీ కార్మికుల జీవితాలపై విస్తృత పరిశోధన చేసారని తెలిపారు. వాస్తవ పరిస్థితులను ఆవిష్కరిస్తునే యువతరానికినచ్చే హంగులతో రూపొందించామని వారన్నారు. గల్ఫ్‌లో నివశిస్తున్న ప్రవాసీ కార్మికుల జీవితాలపై వాస్తవాలకు దగ్గరగా వుండే విధంగా కమర్షియల్ హంగులతో చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్‌లో పనిచేస్తున్న దాదాపు 25 లక్షల మంది కార్మికుల సమస్యలపై పరిష్కారం చూపే ప్రయత్నం చేసామని అదే విధంగా వారి సమస్యలు తీర్చడానికి రాష్ట్ర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాక గల్ఫ్ దేశాల్లో కూడా తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. సంతోష్ పవన్, అనిల్ కల్యాణ్, పూజిత, సూర్య, శివ, పోసాని, నాగినీడు, జీవ, నల్లవేణు, ప్రభాస్‌శ్రీను, తనికెళ్ల భరణి, తోటపల్లి మధు, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సన, తీర్థ, బిత్తిరి సత్తి, భద్రం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, మాటలు: పుల గం చిన్నారాయణ. దర్శకత్వం: సునీల్‌కుమార్ రెడ్డి.