ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్‌సింగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుపుకుంటోంది. ఐదురోజులపాటు ఏకధాటిగా జరిగే షూటింగ్‌లో హీరోయిన్ కాజల్ కూడా పాల్గొంటుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన విడుదల హక్కుల్ని ప్రముఖ సంస్థ ఏరోస్ సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా అంతే భారీగా జరిగిందట. మార్చిలో ఈ చిత్రంలోని పాటలను విడుదల చేసి, ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందాల భామలు లక్ష్మీరాయ్, సంజనలు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కేరళ షూటింగ్ ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు చాలా ఆసక్తితో ఉన్నారు.