నేడే రాజుగారి టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్యపాత్రలో సమంత, సీరత్‌కపూర్‌లు నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’. ఓంకార్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేయనున్నారు. నాగార్జున కెరీర్‌లో మొదటిసారి హర్రర్, థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇంతకుముందు వచ్చిన ‘రాజుగారి గది’ చిత్రానికి ఇది సీక్వెల్. దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రం మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సమంత పాత్ర కీలకంగా వుంటుందని తెలిసింది. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు తెలిసింది.