నా రూటే సపరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలీ రజా, మధుమిత కృష్ణ జంటగా గిరిధర్ దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎం.సుబ్బలక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘నా రూటే సపరేటు’. చిత్రీకరణ పూర్తయి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు గిరిధర్ మాట్లాడుతూ- ఈజీ మనీ నేపథ్యంలో సాగే చిత్రమిది. నేటితరం యువతీ యువకులు ఈజీ మనీ కోసం ఎలాంటి ఇబ్బందుల్ని కొనితెచ్చుకుంటున్నారు? దాని ద్వారా వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి అన్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన వినోదాత్మక చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. నిర్మాత వామనరావు మాట్లాడుతూ- చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాము. త్వరలో పాటలతోపాటు చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. హీరోయిన్ మధుమిత మాట్లాడుతూ- లజ్జ తరువాత నటనకు ఆస్కారమున్న పాత్రలో నటిస్తున్నాను. ఈజీ మనీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే సత్య పాత్ర నాది. భిన్న పార్శ్వాల్లో వుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.