గుడ్ అండ్ అగ్లీ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మురళి, శ్రీముఖి జంటగా హర్షవర్థన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుడ్ అండ్ అగ్లీ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేశారు. హర్షవర్థన్ మాట్లాడుతూ- దర్శకుడిగా తాను తొలి చిత్రంగా ఈ సినిమా అందిస్తున్నామని, మంచి కానె్సప్టుతో రూపొందే ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని తెలిపారు. 1988, 89 మధ్యకాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథతో ఫీల్‌గుడ్ ఎలిమెంట్స్‌తో పక్కా కమర్షియల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, చిన్న సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం తమ యూనిట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చిందని, త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కిశోర్, సంతోష్, చెర్రి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సురేష్ కవి, ఎడిటింగ్:కిశోర్, పాటలు:చైతన్యప్రసాద్, శ్రీమణి, నిర్మాత:అంజిరెడ్డి, రచన, సంగీతం, దర్శకత్వం:హర్షవర్థన్.