ఆస్ట్రేలియాలో ప్రాజెక్ట్ సి 420

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైతన్య, దివిప్రసన్న జంటగా మహేష్ దర్శకత్వంలో ఫిలిం అండ్ సి పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ సి 420’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆస్ట్రేలియా కాన్‌బెర్రాలో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదు కాని ఒక చిన్న తప్పుతో జీవితంలో అనేక పరిణామాలు ఎదురవుతాయన్న పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఇండియన్స్, ఆస్ట్రేలియన్స్, ఇండోనేషియన్స్, పాకిస్తానీ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 80 శాతం ఆస్ట్రేలియా సాంకేతిక నిపుణులతో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి అక్టోబర్ 30న సినిమా పూర్తిచేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:మార్క్ కె.రాబిన్, కెమెరా: సంతోష్ శానవౌని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మహేష్.