డబ్బింగ్ వద్దు...ద్విభాష ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు హీరోలు నటించిన చిత్రాలు తమిళ, హిందీ భాషల్లోకి డబ్బింగ్ రూపంలో వెళ్లి నిర్మాతకు భారీ వసూళ్లను అందిస్తున్నాయి. అలాగే తమిళ హీరోలు నటించిన సినిమాలను చిన్న నిర్మాతలు హక్కులు తీసుకుని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే, అత్యధిక లాభాలను పొందుతున్నారు. హిందీ చిత్రాలు కూడా అప్పుడప్పుడు తెలుగులో డబ్బింగ్ రూపంలో పలకరిస్తూనే వున్నాయి. డబ్బింగ్ అంటే దాదాపు నిర్మాణ ఖర్చు లేకుండా కేవలం అనువాద కార్యక్రమాలు మాత్రమే కొంత ఖర్చు చేసి విడుదల చేస్తే లాభసాటిగా వుంటుందన్న ఆలోచనకు నిర్మాతలు డబ్బింగ్‌వైపు మొగ్గు చూపారు. సినిమాలో కథాపరంగా చిత్రీకరణ పరంగా సాంకేతికత పరంగా వైవిధ్యం ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆయా చిత్రాలను ఆదరించారు. అనుకున్నదానికన్నా ఎక్కువ లాభాలను అందించారు. ఈ ఉత్సాహంతో కొందరు మూలబడిన చిత్రాలను కూడా తీసుకుని అనువాద రూపంలో టాలీవుడ్‌పై వదిలారు. కానీ కథలో వైవిధ్యం లేకపోతే డబ్బింగ్ సినిమాలను చూడడానికి ఇష్టపడడంలేదు. ఈ విధంగా పరభాషా చిత్రాలను అటు తమిళులు, ఇటు తెలుగువారు కొద్దో గొప్పొ మళయాళీలు కూడా ఆదరించారు. ఇదంతా గతం.
ఇప్పుడు మాత్రం ట్రెంట్ మారుతోంది. తమిళ హీరోలు దాదాపు పది సంవత్సరాల క్రితమే ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకున్నారు. డబ్బింగ్ చిత్రాల స్థానంలో ద్విభాషా చిత్రాలను రూపొందించి మార్కెట్‌ను పెంచుకోగలిగారు. సూర్య, విజయ్, కార్తీ లాంటివాళ్లు ద్విభాషా చిత్రాలవైపు మొగ్గి అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్నారు. గతంలో కూడా జయశంకర్, ఎంజిఆర్, శివాజీ గణేశన్‌లాంటివాళ్లు ద్విభాషా చిత్రాలవైపు మొగ్గు చూపకపోయినా కొత్తతరం ఆ దారిలో ప్రయాణించి సరికొత్త హీరోయిజాన్ని స్టామినాను ఏర్పరుచుకున్నారు. ఈ ట్రెండ్ హిందీ రంగంలో కూడా అప్పుడప్పుడు కనిపించింది. సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, హృతిక్ రోషన్ లాంటి కథానాయకులు తెలుగు చిత్రాలవైపు ఓ చూపు చూసారు. కానీ హిందీనుండి తెలుగులోకి అనువాదం కష్టతరం అవ్వడంతో కొంత కార్యరూపంలో జరగలేదు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్‌లో ద్విభాషా పద్ధతిలో చిత్రాలను రూపొందించడంవల్ల అటు మార్కెట్ పెరుగుతుంది, మరోవైపు స్టార్‌డమ్ పెరిగి ఆయా భాషల చిత్రాలకు స్టామినా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోలు ముఖ్యంగా తెలుగు హీరోలు ఇప్పుడిప్పుడే ఆవైపు అడుగులు వేస్తున్నారు. నచ్చిన కథ దొరికితే అటు తమిళంలోను, ఇటు హిందీలోను చిత్రాలను చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందుకు పాడింగ్ ఆర్టిస్టులు అన్నట్టుగానే దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా పలు భాషలకు సంబంధించిన వాళ్లు తోడవడంతో ఆయా సినిమాలకు ఎన్ని భాషల్లో రూపొందిస్తే ఆ భాషలకు సంబంధించిన ఫ్లావర్ అంటుతోంది. దీంతో హీరోల పని నల్లేరుపై నడకలా సాగుతోంది. తాము ఏ భాషల్లో మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారో ఆ భాషలకు సంబంధించిన చిత్రమే కాక మాతృ భాషలో కూడా చిత్రం చేయడంతో బై లింగ్వల్ చిత్రాలు సాధ్యమవుతున్నాయి. అప్పుడప్పుడు త్రిభాషా చిత్రాలు కూడా మనం చూడవచ్చేమో. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు తమిళ సీమవైపు చూస్తున్నారు. అలాగే మహేశ్ బాబు కూడా స్పైడర్ చిత్రంతో తమిళంలో డైరకు టచిత్రంగా విడుదల చేస్తున్నారు. రానా ఘాజీ అందించిన ఉత్సాహంతో తమిళ సినిమాలవైపు ఎప్పుడో మొగ్గు చూపారు. అల్లు అర్జున్ తన చిత్రాల ద్వారా ఇప్పటికే మాలీవుడ్‌లో పాగా వేసారు. అల్లు అర్జున్ అటు మలయాళం, ఇటు తెలుగులోనే కాక డైరెక్టు తమిళ చిత్రంలో కూడా నటించే ప్రయత్నం చేస్తున్నారు. సో త్రిభాషా చిత్రంగా చేయడానికి అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం హీరోల ట్రెండ్ ఒక్క భాషపైనే దృష్టి పెట్టడం కాకుండా పలు భాషలకు సంబంధించిన చిత్రాల్లో నటించడానికి ముందుకు రావడం శుభ పరిణామమే. ఇది తెలుగు హీరోల స్టామినాను చాటే అంశమే!

- వాహిని