సహజత్వానికి దగ్గరగా ఉంటేనే మెచ్చుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మురుగదాస్ సినిమాలంటే దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వుంది. దర్శకుడిగా కమర్షియాలిటీని వాడుకుంటూనే సమాజానికి కావాల్సిన మెసేజ్‌ని అందిస్తూ సినిమాలు తీస్తాడు. అందుకే ఆయన సినిమాలకు అంత క్రేజ్. పోలీస్ వ్యవస్థలో ఉన్న అవినీతిని బయటపెట్టాలన్నా, సమాజంలోవున్న విద్రోహశక్తులను ఏరివేయాలన్నా, రైతుల సమస్యలను మన కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆయన శైలే వేరు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. రమణ, స్టాలిన్, కత్తి, గజిని, తుపాకి సినిమాల తరువాత మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పైడర్’. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా ఎస్.కె.సూర్య కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా క్రియేటివ్ దర్శకుడు మురుగదాస్‌తో ఇంటర్వ్యూ...
* స్పైడర్ విషయంలో టెన్షన్ పడుతున్నారా?
- సూపర్‌స్టార్ మహేష్‌తో రెండు భాషల్లో సినిమాను చేయడంవల్ల తెలియకుండానే కాస్త టెన్షన్‌గా వుంది. దానికితోడు మొదటిసారి రెండు భాషల్లో ఈ సినిమాను చేయడం కూడా కారణం.
* తెలుగులో స్ట్రెయిట్ సినిమాకోసం ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం?
- పదేళ్ల క్రింద చిరంజీవితో ‘స్టాలిన్’ చేశాను. ఆ సినిమా తరువాత నేను తీసిన కత్తి, తుపాకి సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. అలాగే హిందీలో కూడా చేశాను. దాంతో తెలుగులో చేయడానికి సమయం కుదరలేదు. ఈసారి తప్పకుండా బైలింగ్వువల్ చేద్దామని నిర్ణయించుకుని ‘స్పైడర్’ తీశా.
* ఇంతకీ స్పైడర్ ఏంటి?
- ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఒకటి- హ్యూమానిటీ. ఒక పెద్ద సంఘటన ఏదైనా జరిగితే తప్ప అక్కడ హ్యూమానిటీ అనేది కన్పించడంలేదు. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే దాన్ని వీడియోగా తీసి అందరికీ షేర్ చేద్దామనే ఆలోచన వుంటుంది తప్ప అందులో హ్యూమానిటీ కన్పించదు. అదే 20 ఏళ్ళ క్రితం అయితే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించేవాళ్లు. హెల్ప్ చేయడానికి ముందుకొచ్చేవాళ్లు. రోజురోజుకీ మన ప్రేమ, అభిమానాలమధ్యకు చాలా అంశాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక డివైస్‌కు అతుక్కుపోతున్నారు. అది ఫోన్ అయినా కావచ్చు, మరేదైనా కావచ్చు. ప్రస్తుతం మన లైఫ్‌లో సీక్రెట్ అనేది లేకుండా పోయింది. దానికి కారణం కెమెరాలు మన చుట్టూ వచ్చేశాయి. ఎవరూ ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారనేది తెలిసిపోతోంది. సో.. ఆ టెక్నాలజీకి హ్యూమానిటీని జోడించి చేసిన సినిమా ఇది.
* మహేష్ కోసమే ఈ కథా?
- అవును. ఇందులో ఇంటిలిజెన్స్ జూనియర్ ఆఫీసర్‌గా మహేష్ కన్పిస్తాడు. పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ఇంటిలిజెన్స్ అనేది ఎలా వుంటుందో ఈ సినిమాలో అతని పాత్ర ద్వారా చూపిస్తున్నాం. మహేష్ అద్భుతంగా చేశాడు.
* విలన్‌గా ఎస్.జె.సూర్యను ఎంచుకోవడానికి కారణం?
- విలన్ పాత్ర భిన్నంగా వుండాలనుకున్నాను. 50 మంది ఒకేసారి వచ్చినా మహేష్ కొట్టగలడు. ఆ పవర్‌ని అతనిలో చూపించవచ్చు. ఇప్పటివరకూ మహేష్ సినిమాలో చాలామంది విలన్లను చూశాం. కానీ కనిపించకుండా దాక్కొని వుండే విలన్ ఎప్పుడైనా గొరిల్లా అటాక్ చేయొచ్చు. అతనికి రూల్స్, చట్టమనేది లేదు. మహాభారతంలో శకునిలా ఉండే పాత్ర అది. సైకలాజికల్‌గా దెబ్బతీసే పాత్ర కాబట్టి అతన్ని ఎంచుకున్నాం. సూర్య అద్భుతంగా చేశాడు. ఆ పాత్రను చూస్తుంటే టెన్షన్ పుడుతుంది.
* ప్రేక్షకులకు మెసేజ్ ఇస్తే రిసీవ్ చేసుకుంటారా?
- కమర్షియల్ సినిమా అయినా డైరెక్ట్‌గా మెసేజ్ ఇస్తే బాగుండదు. దానికి షుగర్ కోటింగ్ ఇస్తూ పెద్ద హీరోతో కమర్షియల్ వేలో చేస్తే తప్పకుండా రీచ్ అవుతుంది.
* బైలింగ్వువల్ సినిమావల్ల రిస్క్ ఫీలయ్యారా?
- రెండు భాషల్లో ఒకేసారి ఈ సినిమా చేయడం కాస్త రిస్కే. ఇక్కడ కొన్ని లాంగ్ షాట్ సన్నివేశాలు రెండు భాషలకూ వాడొచ్చు. కానీ మహేష్ ఇక్కడ సూపర్‌స్టార్ కాబట్టి ఆయనకు తగ్గట్లుగా సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టొచ్చు. కానీ తమిళ్‌లో మహేష్ కొత్త హీరో. ఇక్కడ ఇచ్చినట్టుగా బిల్డప్ షాట్స్ పెడితే అక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. అందుకని చాలా విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వచ్చింది. తమిళ్ సినిమా చూస్తే ఆ తేడా ఏంటో మీకు తెలుస్తుంది.
* హీరోయిన్ రకుల్ గురించి?
- ఇందులో రకుల్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. తను మంచి నటి. మహేష్‌తో పాటు రకుల్ కూడా అద్భుతంగా చేసింది.
* చిరంజీవి, మహేష్ ఇద్దరు స్టార్‌లతో పనిచేశారు కదా! ఇద్దరిలో మీకు కంఫర్ట్‌గా ఎవరిని ఫీల్ అయ్యారు?
- పది సంవత్సరాల క్రితం స్టాలిన్ చేసినపుడు నేను చాలా యంగ్. చిరంజీవిగారు సీనియర్, నాకన్నా ఏజ్‌లో కూడా చాలా పెద్ద. ఆయనతో సినిమా అంటే భయముండేది. పైగా మొదటిసారి వేరే భాషలో సినిమా చేయడంవల్ల టెన్షన్‌గా వుండేది. కానీ మహేష్‌తో నాకు పదేళ్లుగా పరిచయం. తనకు, నాకు వయసు తేడా కూడా పెద్దగా లేదు కాబట్టి మహేష్‌తో చాలా ఫ్రెండ్లీగా చేశాను.
* రజనీకాంత్‌తో సినిమా ఎప్పుడు?
- రెండు మూడుసార్లు ఆయన్ని కలిశాను. కథ కూడా చెప్పాను. కానీ డేట్స్ కుదరలేదు. మా కాంబినేషన్‌లో ఎప్పుడైనా సినిమా ఉండొచ్చు.
* ప్రభాస్‌తో సినిమా చేస్తారని తెలిసింది?
- నేను ప్రభాస్‌తో ఒకటి రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడాను తప్ప పర్సనల్‌గా కలవలేదు. తనతో ఏ ప్రాజెక్టు గురించి చర్చించలేదు.
* తదుపరి చిత్రాలు?
- విజయ్‌తో త్వరలోనే సినిమా షూటింగ్ మొదలవుతుంది.

- శ్రీ