జీవితంలో ఓ పెళ్లిరోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీయోగ్ పతాకంపై నెల్సన్ వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పెళ్లిరోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నటి జమున లోగోను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ- దాదాపు 50 సంవత్సరాల క్రితం తాను పెళ్లిరోజు చిత్రంలో నటించానని, పెళ్లివారమండీ ఆడపెళ్లివారమండీ ఆ సినిమా కోసం తాను పాడానని, మళ్లీ ఇన్ని రోజుల తరువాత ఇదే పేరుతో నిర్మాతలు సురేష్, ప్రవీణ్ సినిమా రూపొందించారని తెలుసుకొని ఈ కార్యక్రమానికి వచ్చానని ఆమె తెలిపారు. జీవితంలో ప్రతివారికి ఎంతో ప్రాధాన్యత వుండేరోజు పెళ్లిరోజని, ఇపుడు తెలుగు సినిమాలకు పెడుతున్న పేర్లు వినాలంటే ఎబ్బెట్టుగా వుంటున్నాయని, తెలుగుతనాన్ని మర్చిపోయేలా టైటిల్స్ వుంటున్నాయని, విలువలతో కూడుకున్న సినిమాల ప్రభావం సమాజంమీద గొప్పగా వుంటుందని ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని అక్కడ బాగా ఆదరించారని, కొన్ని మార్పులతో తెలుగులో కూడా విడుదల చేస్తున్నామని, నేటి యువతీ యువకుల మనస్తత్వాలకు, భావాలకు ఈ చిత్రం అద్దం పడుతుందని దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ అన్నారు. పెళ్లికోసం ఆరాటపడే ముగ్గురు యువతులమధ్య జరిగే కథే ఈ చిత్రమని ఆయన అన్నారు. తెలుగులో తాము అందిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, చక్కటి కథతో విజయం సాధిస్తుందని నిర్మాతలు బల్ల సురేష్, మృదుల మంగిశెట్టి, ప్రవీణ్ మంగిశెట్టి తెలిపారు. కార్యక్రమంలో కథానాయికలు మియాజార్జ్, రిత్విక, మల్లూరి వెంకట్, జస్టిస్ ప్రభాకరన్, తుమ్మల ప్రసన్నకుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.