‘సాయి నీ లీలలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరుణామయుడిగా, వేమనగా, ఆంధ్రకేసరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన నటుడు విజయ్‌చందర్. తాజాగా ఆయన శ్రీ షిరిడీ సాయినాథుని కథను ‘సాయి నీ లీలలు’ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్‌చందర్ దర్శకత్వంలో సజ్జల శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదద్దుకుంటోంది. కాగా ఈ సినిమా పాటల రికార్డింగ్ పనులు అక్టోబర్ 1న మొదలు కానున్నాయి. ఆ యోగి రాజు సజీవ సమాధి చేరి శతాబ్ధం గడుస్తున్న సందర్భంలో సాయి భక్తులంతా భక్తి పారవశ్యంలో సంబరాలు జరుపుకుంటున్నారు. వారి సంబరాలను పదింతలు చేసేందుకు ‘సాయి నీ లీలలు’ మరింత సమాయత్తమవుతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకులు ఆది-అనంత్‌లకు శుభాశీస్సులు అందిస్తూ అందరి ప్రోత్సాహంతో సినిమా నిర్మాణం సాగాలని విజయ్‌చందర్ కోరారు. 1986లో విజయ్‌చందర్ నటించిన శ్రీ షిరిడీ సాయి మహాత్మ్యం చిత్రం విడుదలై సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ చిత్రం విడుదలకు ముందు, విడుదల తర్వాత షిరిడీ స్వరూపంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రతి సాయి భక్తుడు విజయ్‌చందర్‌లోనే బాబాను చూసుకున్న సందర్భాలు కోకొల్లలు. 30 సంవత్సరాల తర్వాత అదే బాబా ఆశీస్సులతో ‘సాయి నీ లీలలు’తో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. షిరిడీ సాయిబాబా లీలలు అనేకం. వాటిలో ముఖ్యమైనవి, ముక్తిదాయకమైనవి ఏరి పూసగుచ్చి సాయి భక్తులకి అందించాలన్నదే ఈ చిత్రం సంకల్పమని నిర్మాణ సారథులు పేర్కొన్నారు.