బాలయ్య చిత్రం భారీ షెడ్యూల్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ చిత్రాన్ని సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా కుంభకోణంలో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోంది. సోమవారంతో ఈ షెడ్యూల్ పూర్తయింది. చివరి రోజున ఈ చిత్రానికి సంబంధించి భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఓ ఆలయం నేపథ్యంలో సాగే యాక్షన్ ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, మురళీమోహన్, జయప్రకాష్‌రెడ్డి, ఎల్.బి శ్రీరామ్‌లతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాలుపంచుకుంది. దాదాపు రెండు వేల మంది పురోహితులు, ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అరివి మణి ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘సెనే్సషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణతో 102వ చిత్రాన్ని నిర్మిస్తుండటం చాలా సంతోషంగా వుంది. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారు. ‘శ్రీరామ రాజ్యం’, ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ సరసన నయనతార నటించనుండడం విశేషం. రాంప్రసాద్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా, బాలయ్య 100వ చిత్రమైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంగీత సారథ్యం వహించి, చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండటం విశేషం. 30 రోజులపాటు సాగిన కుంభకోణం షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ పోరాట ఘట్టం రూపొందించాం. బాలయ్యపై ఓ గీతాన్ని తెరకెక్కించాం. ఖర్చుకు ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత సాంకతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’అని చెప్పారు.
బాలకృష్ణ, నయనతార, నటాషా దోషీ, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానం దం, జయప్రకాష్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అరివి మణి, అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వరణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం కె.ఎస్.రవికుమార్.