కథతో రాఖీ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనే పెద్ద పుడింగి బాబానంటూ అటు పంజాబ్.. ఇటు హర్యానా ప్రజలను నమ్మించి మోసం చేసిన దొంగ బాబా గుర్మీత్‌సింగ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఆయన జీవితంపై సినిమాకు సిద్ధం అవుతుంది బాలీవుడ్ సంచలన తార రాఖీ సావంత్. అయితే ఈమె నటిస్తున్నది ఎవరి పాత్రలో తెలుసా.. ఇన్నాళ్లుగా తన కూతురిగా చెప్పుకు తిరిగిన గుర్మీత్ లవర్ హానీప్రీత్ పాత్రలో? హానీప్రీత్ తనకు ఎనిమిదేళ్లుగా తెలుసునని, ఆమె గురించి నాకు అన్ని విషయాలు తెలుసనీ, ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటుందని చెప్పిన రాఖీ, ఈ సినిమాను తనతోపాటు తన అన్న రాకేష్‌తో కలిసి నిర్మిస్తానని అంటోంది. ఈ సినిమాకోసం ఢిల్లీలో డేరా సచ్చాసౌదాలో సెట్స్ కూడా వేయిస్తుందట! గుర్మీత్ వ్యవహారాలన్నీ బయటపెడితే తప్ప తనకు శాంతం లేదని పేర్కొంది. మరి ఈ సినిమాతో రాఖీ ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాల్సిందే మరి!