రెండేళ్ల ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ్ తాండల్, నేహా దేశ్‌పాండే, అజయ్‌ఘోష్ ప్రధాన పాత్రల్లో సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో నిర్మాని ఫిలిమ్స్ పతాకంపై మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘వాడేనా’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. ఈ విడుదల కార్యక్రమం తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, రాజ్ కందుకూరి, మల్కాపురం శివకుమార్, సురేష్ కొండేటి, శివ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సినిమా కంటెంట్, క్వాలికీ బాగుండి తగిన ప్రమోషన్ చేయగలిగితే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. మా వంతు సహాయ సహకారాలు ఈ చిత్రానికి అందిస్తామని తెలియజేశారు. లవ్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది నిర్మాతలే ఈ ‘వాడేనా’ చిత్రానికి హార్ట్‌లాంటి వారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించారు. స్క్రీన్‌ప్లే బేస్డ్ కథ కనుక ప్రతి ప్రేక్షకునికి నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నానని చిత్ర దర్శకుడు సాయి సునీల్ నిమ్మల తెలిపారు. మా రెండు సంవత్సరాల ప్రయాణమే ‘వాడేనా’ చిత్రం. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా దర్శకుడు అడిగింది అందించాం అని నిర్మాతల్లో ఒకరైన ధృవ్ అన్నారు. హీరో శివ్ పాండే, హీరోయిన్ నేహా పాండే తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలియజేశారు.
శివ్ తాండల్, నేహా దేశ్‌పాండే, అజయ్ గోష్, సూర్య, నల్ల వేణు, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సి.్భమేశ్వర చారి, మాటలు: సాయి సునీల్ నిమ్మల, సి. భీమేశ్వర చారి, పాటలు: కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, కొరియోగ్రఫీ: ఆర్కే, ఫైట్స్: రవి, ఎడిటింగ్: ఎస్.బి. ఉధవ్, ఆర్ట్: బాబ్జీ, సినిమాటోగ్రఫీ: డి.ఆర్ వెంకట్, సంగీతం: కిరణ్ వెన్న, రి రికార్డింగ్: ఎస్.రాజేష్, నిర్మాత: మణిలాల్ మచ్చి, అండ్ సన్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల.