కొత్త కొత్తగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ సరసన ముంబై భామ కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. తొలిసారిగా కథానాయకుడిగా రాహుల్ విజయ్‌ని వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్య విజయ్ పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా కథానాయిక కావ్య థాపర్ మాట్లాడుతూ- బిఎంఎస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తాను ముంబైనుండే వచ్చానని, అతుల్ మోంగియా వద్ద నటనలో శిక్షణ తీసుకున్నానని, పతంజలి, డైజెస్ట్ బిస్కెట్స్, సేఫ్ డిటర్జెంట్, ఫ్యాషన్ బిగ్‌బజార్, మేక్ మై ట్రిప్ వంటి బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించానని, ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా పరిచయం కావడం ఆనందాన్నిస్తోందని, తప్పక ఈ చిత్రంతో తనను అందరూ ఆదిరిస్తారన్న నమ్మకం వుందని ఆమె అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: రాము కొప్పుల.