తమిళ అర్జున్‌రెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్‌రెడ్డి చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమా అటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు సినిమా రీమేక్ హక్కుల విషయంలో సంచలనం రేపింది. తమిళ రీమేక్ హక్కులకోసం గట్టి పోటీ ఏర్పడగా, హీరో ధనుష్ భారీ మొత్తానికి స్వంతం చేసుకున్నారు. అయితే ఈ రీమేక్‌లో ఆయనే నటిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అర్జున్‌రెడ్డిగా నటించేదెవరో తెలిసిపోయింది. భిన్నమైన సినిమాలతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఆర్య హీరోగా నటిస్తాడట. ఇప్పటికే దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి రానున్నదట. మరి అర్జున్‌రెడ్డిగా ఆర్య ఇంకెలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి మరి!