బ్రదర్ సెంటిమెంట్‌తో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను రూపొందించే విజయ్ ఆంటోనీ తాజాగా నటిస్తున్న చిత్రం ఇంద్రసేన. రాధిక శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి జి.శ్రీనివాసన్ దర్శకుడు. కమర్షియల్ హీరోగా బిచ్చగాడు, భేతాళుడు, యెమన్ చిత్రాలతో హిట్ బాటపట్టిన విజయ్ ఆంటోనీ తాజాగా నటిస్తున్న ఇంద్రసేన చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. బిచ్చగాడు చిత్రంలో మదర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకున్న విజయ్ , తాజా చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్‌తో ఈ చిత్రం రూపొందించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసిన ఈ సినిమా సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల చిరంజీవి విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌కు ఆదరణ బాగావుందని, త్వరలోనే ఆడియోను, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని నిర్మాతలు తెలియజేశారు. డైనా చంపిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మహిమ, మారి, రాధారవి, కాళీవెంకట్, నళినీకాంత్, సింధు రవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మాటలు, మాటలు: భాషాశ్రీ, సంగీతం: కూర్పు విజయ్ ఆంటోనీ, కెమెరా: కె.దిల్‌రాజ్, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.