రాజవౌళి దర్శకత్వంలో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్న రామ్‌చరణ్ తదుపరి చిత్రానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే రంగస్థలం 60 శాతం పైగా షూటింగ్ పూర్తయింది. వచ్చే సంక్రాంతికి విడుదలకానున్న ఈ సినిమా తరువాత చరణ్ రాజవౌళి దర్శకత్వంలో నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాజవౌళితో చర్చలు జరిపాడని టాక్. ‘బాహుబలి’ తరువాత రాజవౌళి తదుపరి సినిమా ఎవరితో అన్న ఆసక్తికి బ్రేక్‌పడింది. ఇటీవలే ‘సైరా’ టీజర్ లాంఛ్‌లో పాల్గొన్నాడు రాజవౌళి. ప్రస్తుతం వీరిద్దరిమధ్య జోరుగా స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం వుందని సమాచారం. రామ్‌చరణ్ కెరీర్‌లో మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన రాజవౌళి ఈసారి ఎలాంటి సినిమా చేస్తాడోనన్న ఆసక్తి మెగా అభిమానుల్లో ఎక్కువైంది. సో.. ఈ సినిమాపై అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని తెలిసింది.