ఫర్వాలేదు.. బాధలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్ బరిలో నిలవడానికి భారతదేశం నుండి అనేక చిత్రాలు పోటీపడ్డాయి. ఏ సినిమా ఆస్కార్ పోటీలో పాల్గొనడానికి వెళుతుందా? అన్న ఉత్కంఠ తీరింది. మరాఠీ చిత్రం ‘న్యూటన్’ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీలో తెలుగు చిత్రాలు బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు ఉన్నాయి. కానీ ఈ రెండూ ఎంపిక కాకపోవడం తెలుగువారికి ఇబ్బందికరమే. అయితే ఈ విషయమై బాహుబలి దర్శకుడు రాజవౌళి స్పందించారు. బాహుబలి సినిమా ఆస్కార్‌కు వెళ్లడంలేదన్న బాధ తనకేమాత్రం లేదని, అయితే సినిమా రూపొందించే సమయంలో అవార్డుల గురించి తాను ఆలోచించలేదని ఆయన అన్నారు. అవార్డు లక్ష్యంతో ఈ సినిమా రూపొందించలేదని, తమ యూనిట్ అంతా సంతృప్తిచెందడానికి మాత్రమే జీవితాలను పెట్టుబడిగా పెట్టి ఈ సినిమా రూపొందించామని, పెట్టుబడికి బాగా లాభాలు వచ్చినందుకు సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. అవార్డులు వస్తే సంతోషమే కానీ, రాకపోతే వాటి గురించి ఆలోచించే అవసరం తనకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. దటీజ్..జక్కన్న.