ఫాంటసీ ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్‌రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా, వింగ్స్ మూవీస్ మేకర్స్ పతాకంపై ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో జి.ప్రతిమ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ- ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ చిత్రం సాగుతుందని, సోషియో ఫాంటసీ కథనంతో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుందని, ఒక పాట మినహా కీలక సన్నివేశాలను చిత్రీకరించామని తెలిపారు. త్వరలో రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించి ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ చేస్తామని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సరికొత్తగా వుంటాయని, వారిమధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినందువల్ల ప్రేక్షకులకు ఓ మంచి ప్రేమకథ చూశామన్న అనుభూతి కలుగుతుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. నాగినీడు, పృధ్వీరాజ్, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సిద్ధార్థ్, కెమెరా:మలహర్‌భట్ జోషి, మాటలు:ప్రదీప్ ఆచార్య, నిర్మాత:ప్రతిమా.జి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పూర్ణానంద్.ఎం.