6న ఓయ్.. నినే్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్యా చల్లకోటి దర్శకత్వంలో ఎస్.వి .కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘ఓయ్.. నినే్న’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- మన సంతోషానికి దగ్గరగా ఉన్నపుడే మనం సుఖంగా ఉంటామని నమ్మే ఓ కుర్రాడు, కాలేజీలో ఓ అమ్మాయి ప్రేమలో పడితే.. ఆ తరువాత ప్రేమ ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? ఏదో ఎంపిక చేసుకోమని ఆ ప్రియురాలు అంటే, కథానాయకుడు ఏం చేశాడు? అనేదే ఈ సినిమా కథనమని, ఆమె మాట వింటే ప్రేమా? అతని మనసు మాట వింటే కుటుంబం వుంటుందన్న ఆలోచనతో అతని నిర్ణయం ఎలా సాగిందీ అనేదే ఈ చిత్రమని తెలిపారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో హీరో ముక్కుసూటి మనస్తత్వంతో ఉంటాడని, ఆ పద్ధతి అతనికి కొన్నిసార్లు మంచి చేస్తే, మరికొన్నిసార్లు చెడు చేస్తుందని, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు సత్యా చల్లకోటి తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆయన అన్నారు. తనికెళ్ల భరణి, నాగినీడి, రఘుబాబు, సత్య, తా.రమేష్, తులసి, ప్రగతి, ధన్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, దర్శకత్వం:సత్యా చల్లకోటి.