బిగ్‌బి న్యూ లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిగ్ బి అమితాబ్ కొత్తరూపంలో దర్శనమిచ్చారు. రోజూ కన్పించే రూపానికి భిన్నంగా కొత్త ఆహార్యంతో అభిమానులను అలరించారు. రిభుదాస్ గుప్తా దర్శకత్వంలో సుజొయ్ ఘోష్ నిర్మిస్తున్న ‘ళ3శ’లో అమితాబ్, నవాజుద్దీన్ సిద్ధిఖి, బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభమైంది. వదులుగా ఉన్న గళ్లచొక్కా, ఫ్యాంట్, ఫ్రెంచ్ గెడ్డం, పాతకాలపు కళ్లజోడు, పక్కకు దువ్విన క్రాఫ్‌తో అమితాబ్ సరికొత్తగా కన్పించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర గురించి బయటకు ఏమీ పొక్కనివ్వడం లేదు. 2010లో ‘పికు’ చిత్రీకరణకోసం కోల్‌కతావెళ్లిన అమితాబ్ ఇప్పుడు మరోసారి వచ్చారు. నగరంలోని రవీంద్ర సరోవర్ సరస్సువద్ద జరిగిన షూటింగ్‌లో బిగ్‌బి బిజీగా కన్పించారు. ఈ చిత్రంలో నటిస్తున్న విద్యాబాలన్‌కూడా సరికొత్త తరహాలో కన్పిస్తారు. నిజానికి ఈ చిత్రం స్క్రిప్ట్‌కూడా చూడకుండా అమితాబ్ నటించేందుకు ఒప్పుకున్నారని చెబుతున్నారు. అంతనమ్మకంగా ఆయన అంగీరించిన ఈ సినిమాగురించి ఇప్పటికైతే వివరాలు పెద్దగా బయటకు రానివ్వలేదు.