సంక్రాంతికి రాజుగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర వివరాలు తెలియజేస్తూ- ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ‘రాజుగాడు’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాగా వచ్చింది, లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని సమస్త హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు పాటలు మినహా చిత్రీకరణ అంతా పూర్తి చేసాం, రాజేంద్రప్రసాద్, రావురమేశ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు, తప్పకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎన్.ఆర్.వర్మ, కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: సంజనారెడ్డి.