శర్వానంద్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి సినిమాతోనే నటి గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది మలయాళ భామ నివేదా థామస్. నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్‌మాన్’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా హిట్‌తో వరుస అవకాశాలను పట్టేసింది. ఈమధ్యే నానితో చేసిన ‘నిన్నుకోరి’ సినిమాతో స్టార్ హీరోయిన్ల రేసులోకి వెళ్లిపోయింది. ఎన్టీఆర్ సరసన ‘జై లవకుశ’తో మరో విజయాన్ని అందుకున్న నివేదాకు తాజాగా మరో అవకాశం దక్కింది. ఇటీవలే ‘మహానుభావుడు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక హీరోయిన్‌గా నివేదాను ఎంపిక చేశారని, మరో హీరోయిన్‌కోసం అనే్వషిస్తున్నారట. మొత్తానికి అటు నటనతోను, ఇటు గ్లామర్ పరంగా కూడా క్రేజ్ తెచ్చుకుంటున్న నివేదా స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీగా మారింది.