గోపీచంద్‌తో మలయాళ భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస హిట్స్ తర్వాత మాచో హీరో గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమాతో భారీ ప్లాప్‌ని అందుకున్నారు. రెగ్యులర్ ఫార్మాట్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ ఓ డిఫరెంట్ కథాంశంతో చేస్తున్న కమర్షియల్ సినిమా ‘ఆక్సిజన్’. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్.రత్నం కుమారుడు ఏ.ఎమ్.జ్యోతికృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఫిబ్రవరినుంచే సెట్స్‌పైకి వెళ్లనుంది.
శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశిఖన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా అవకాశం ఉంది. ఆ పాత్రకోసం యుఎస్‌లో సెటిల్ అయిన మలయాళ బ్యూటీ అను ఇమాన్యుయెల్‌ని సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక చేసారు. తను చేయబోయే పాత్ర చాలా బోల్డ్‌గా ఉండడమే కాకుండా, నటనకి చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. అను అయితేనే ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయగలదని జ్యోతికృష్ణ ఆమెను సెలక్ట్ చేశారు. రీసెంట్‌గా మలయాళ స్టార్ నివిన్ పాళీ నటించిన యాక్షన్ హీరో బిజులో నటించింది.