ఆలోచించేవారికే నా సినిమాలు నచ్చుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలో అన్ని కమర్షియల్ సినిమాలు మాత్రమే వస్తాయి. విభిన్న కథాచిత్రాలు రావు అనే అపోహ ఉంది ప్రేక్షకుల్లో. అప్పుడప్పుడు ఒకరోఇద్దరో దర్శకులు కళాత్మక సినిమాలు తీయగలమని రుజువుచేస్తూ ఉంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు నరసింహనంది. ఇప్పుడున్న దర్శకుల్లో ఈయనది మరో దారి. కమర్షియల్ సినిమాలకు దూరంగా కానె్సప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను రూపొందిస్తూ మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. 1940లో ఒక ‘గ్రామం’ అనే మొదటి సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు నరసింహ నంది. ఆ తరువాత ‘హైస్కూల్’, కమల్‌తో ‘నా ప్రయాణం’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు తాజాగా ‘లజ్జ’ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహనంది చెప్పిన విశేషాలు..
రొటీన్ కోరుకునే వారికి నచ్చదు...
నేను కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేసి సినిమా చేస్తాను. మనుషుల్లో రెండు రకాలుంటాయి. ఆలోచించే వాళ్ళు, ఆలోచించని వాళ్ళు. నా సినిమా ఎక్కువగా చదువుకున్న వాళ్ళకి, ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారికి, ఎక్కువ ఆలోచించే వాళ్లకి మాత్రమే నచ్చుతాయి. రొటీన్‌గా నాలుగు పాటలు, ఫైట్స్ ఉండే సినిమాలు చేయడం నాకు నచ్చదు. కొత్త కథలు అసలు రావట్లేదు. డిఫరెంట్‌గా ఆలోచించి ‘లజ్జ’ అనే సినిమాను తెరకెక్కించాను. నా దృష్టిలో కమర్షియల్ హిట్ అంటే పెట్టుబడి తిరిగి వస్తే చాలు. సినిమా సక్సెస్ అయినట్లే. ఈ సినిమాకోసం చాలా తక్కువ పెట్టుబడి అనుకునే నిర్మించాం. మేము, సినిమా కొనుక్కున్నవారు సంతోషంగానే ఉన్నాం. ఇదివరకు బాలచందర్, బాపు, భారతీరాజా తక్కువ బడ్జెట్‌లో కానె్సప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవారు. అలానే మంచి కానె్సప్ట్ ఉన్న సినిమాను తక్కువ బడ్జెట్‌లో సినిమా చేయాలని బాగా ప్రెజంట్ చేయడానికి ట్రైచేశాం. ఎవరైనా ప్రేక్షకులు చూడడానికే సినిమాలు చేస్తారు. నేను అలాగే... అంతేకాని అవార్డుకోసం సినిమాలు చేయను. మంచి కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమా చేయాలని ప్లాన్ చేస్తా. కాని థియేటర్లదగ్గరకు వచ్చేసరికి అసలు సమస్య మొదలవుతుంది.
ఓ అమ్మాయి జీవితమే..
‘లజ్జ’ సినిమా గురించి చెప్పాలంటే.. పెళ్ళికిముందు అమ్మాయి తప్పుచేసిందంటే అది తండ్రి పొరపాటు. పెళ్ళైన తరువాత తప్పుచేస్తే అది భర్తే తప్పనే చెప్పాలి. భార్యభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవల వలన జీవితాలు నాశనమైపోతున్నాయి. ఆ సమయంలో అమ్మాయికి నచ్చిన వారితో తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవడం. అక్కడ కూడా సంతోషంగా ఉండలేకపోవడం. చివరకు తన జీవితం ఏం అయిందో అనేదే ఈ ‘లజ్జ’ సినిమా. ఈ సినిమా చేస్తున్నానని తెలిసిన ఓ హిందీ చిత్ర నిర్మాత బాలీవుడ్‌లో ఈ సినిమా చేయమని అడిగారు. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మరోసారి చేయలేను. రిస్క్‌తో కూడుకున్న పని.
నా నెక్స్ట్ సినిమా ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ అనే సినిమా ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే సినిమా.
- యు