ఆ సినిమాలో నటించడంలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తున్న రెజీనా తాజాగా బాలకృష్ణ సరసన ఆయన 102వ చిత్రంలో నటిస్తుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన రెజీనా, తాను బాలకృష్ణ సినిమాలో నటించడంలేదని క్లారిటీ ఇచ్చింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలను ఎంపిక చేశారు. నక్షత్రం తర్వాత రెజీనా పరిస్థితి అంతగా ఆశాజనకంగాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తమిళ్‌లో కూడా ఓ చిత్రంలో నటిస్తున్న రెజీనా తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకూ యువ హీరోలతోనే జోడీ కట్టిన రెజీనాకు స్టార్ హీరోల సినిమాల్లో చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నా కూడా పెద్దగా వర్కవుట్ కావడంలేదు.