27న ఇప్పట్లో.. రాముడిలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేందర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రల్లో లక్ష్మీ ప్రొడక్షన్‌లో శివసాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్ తాతా నిర్మిస్తున్న చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు’. ఈ చిత్రానికి వెంకటేష్ కె. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉండటంతో సారథి స్టూడియోలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రశ్నాద్ తాతా మాట్లాడుతూ- ‘‘ఇదే సారథి స్టూడియోలో స్టూడెంట్స్‌గా ఉన్న మేము నేడు స్టేజీ ఎక్కి సినిమా గురించి మాట్లాడం సంతోషంగా ఉంది. ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని ప్రతి ఒక్కరూ ఎలా అనుకుంటారో అలాగే ఈ సినిమాలో మేం చూపించడం జరిగింది. ఈ చిత్రానికి గానూ కొత్త విలన్‌ను పరిచయం చేయడం జరుగుతోంది. ఇప్పుడు వస్తున్న వెజిటేరియన్ సినిమాల మధ్యలో మా సినిమా ఒక వెజిటేరియన్ వస్తోంది అని చెప్పగలను. కథ, కథనాలకు ప్రాధాన్యత ఉన్న మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నా. అలానే ఈ చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నా’’ అన్నారు. దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. వైజాగ్, నెల్లూరు తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు అందించిన రాధాకృష్ణగారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నా’’ అన్నారు. హీరో మహీధర్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో మెయిన్‌రోల్ చేస్తున్నాను. టైటిల్ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో చిత్ర కథాంశం కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుంది. అన్ని పాత్రలకు సమానమైన ఇంపార్టెంట్స్ ఉంటుంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా వుంది. అదే విధంగా ఈ సినిమాలో నటించిన మరో హీరో ప్రశాంత్ ఇటీవలే మరణించడం బాధాకరమైన విషయం’’అని అన్నారు. హీరోయిన్ ఇషిత మాట్లాడుతూ- ‘‘కొత్త వారు అందులోనూ భాష సమస్య ఉంటుందనే అపోహ అందరిలోనూ ఉంటుంది. ఈ ఫీలింగ్ ఏ మాత్రం చూపించకుండా నన్ను సపోర్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు నా కృతజ్ఞతలు’’అని అన్నారు.