గ్యాప్ వచ్చినా ఆదరణ తగ్గలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక జంటగా తమిళ సందరపాండ్యన్‌కు రీమేక్‌గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం స్పీడున్నోడు. భీమనేని సునీత నిర్మాత. ఫిబ్రవరి 5న విడుదల చేసిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సినిమా అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందన్నారు. టీం ఎఫర్ట్ వలనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రకాష్‌రాజ్‌తో ‘సుస్వాగతం’ సినిమా చేశానని, ఆ సినిమాకు ఆయన ఇచ్చిన సపోర్టు మరువలేనిదని, ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఇద్దరం కలిసి పనిచేశామని, తండ్రి పాత్రలో ప్రకాష్ నటన అద్భుతమన్నారు. ఫ్యామిలీస్, యూత్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ మంచి మెమొరబుల్ రోల్స్‌లో నటించే అవకాశం ఇస్తున్న భీమనేని శ్రీనివాస్‌కు ధన్యవాదాలన్నారు. సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్‌గా నటించాడన్నారు. హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘అల్లుడు శీను’ తరువాత చాలా గ్యాప్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదని, అందరూ చాలా బాగా నటించావని చెబుతుంటే పెద్ద అచ్చీవ్మెంట్ సాధించినట్లనిపిస్తోందన్నారు.

అడవిలో వజ్రాల వేట
కిరణ్, సుమి, గిడ్డేష్, సమీరా ప్రధాన తారాగణంగా కె.ఎస్.ఎల్ ఫిలిమ్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరే శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘వజ్రాల వేట’. ఈ చిత్రానికి సంబంధించిన 80శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఒ ప్రముఖ హీరో కీలకమైన పాత్రలో నటించే ఈ చిత్రంలో కథాకథనాలు హైలెట్‌గా ఉంటాయని, ఈ నెలలో సినిమా మొత్తం పూర్తిచేయనున్నామని తెలిపారు. మహనంది, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, కర్నూలులో రెండవ షెడ్యూల్ చేశామని, హీరోహీరోయన్‌లపై పాటలు, హీరో, విలన్‌ల మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరించామని దర్శకుడు శేఖర్‌చంద్ర అన్నారు. 70 మంద పాల్గొన్న యుద్ధ సన్నివేశాలను రెండు కెమారాలతో షూట్ చేశామని, ఒకేసారి వేలకోట్లు సంపాదిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సినిమాలోని అన్ని పాత్రలకు కలుగుతుందని, దాన్ని సాధించటానికి అడవిలోకి వెళ్లిన వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కథనంతో ఈ సినిమా సాగుతుందని ఆయన వివరించారు. వినోద్‌కుమార్, శివ ఫేమ్ శివసత్యన్నారాయణ, హుస్సేన్, మహేశ్వరాచార్య, నందిని తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా బివి రావు, నిర్మాత: కర్రె శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : శేఖర్‌చంద్ర.