మామా అల్లుళ్ల మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ కొత్త ఊపునిచ్చింది హీరో వెంకటేష్. ‘సీతమ్మ వాకిట్లో.. సిరిమల్లెచెట్టు’ సినిమాతో మహేష్‌తో నటించి ఆ తరహా సినిమాలకు కొత్త ఊపునిచ్చాడు. ఆ తరువాత పలు మల్టీస్టారర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మల్టీస్టారర్‌కు సిద్ధమయ్యాడు వెంకీ.. అయితే ఈసారి ఆయన మల్టీస్టారర్ సినిమా చేస్తున్నది ఎవరితో తెలుసా.. మేనల్లుడు నాగచైతన్యతో. అవును వీరిద్దరితో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ కురసాల. నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రాన్ని రూపొందించిన కళ్యాణ్‌కృష్ణ, చైతన్యతో తీసిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మంచి క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో తదుపరి సినిమా కూడా మళ్లీ చైతుతో ప్లాన్ చేశాడు. అయితే ఇందులో మరో హీరో కూడా ఉంటాడని ఆ పాత్రకోసం వెంకటేష్‌ని సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌లో వర్క్‌లో బిజీగా వున్న కళ్యాణ్ కృష్ణ, త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నాడు. మరో వైపు తేజ దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పిన వెంకటేష్‌ని ఏ సినిమా ముందు మొదలుపెడతాడో చూడాలి.