ఆసక్తి రేపుతున్న రాజుగాడు ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ నటిస్తోన్న డిఫరెంట్ ఎంటర్‌టైనర్ ‘రాజుగాడు’. వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్న రాజ్‌తరుణ్.. తనకు వరుస విజయాలను అందించిన నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నటిస్తోన్న చిత్రం ‘రాజుగాడు.’ రాజ్‌తరుణ్ హీరోగా రూపొందించిన ‘ఈడోరకం ఆడోరకం’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘అంధగాడు’ సినిమాలతో హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌తరుణ్ చేస్తోన్న నాలుగో చిత్రమిది. సంజనారెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అమైరా దస్తుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లవర్ అయిన అమైరా దస్తుర్‌ను కౌగిలించుకుంటూనే ఆమె హ్యాండ్ బ్యాగ్ నుండి సెల్‌ఫోన్ కొట్టేయడం ఈ ఫస్ట్‌లుక్‌లో కనపడుతోంది. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్న ఎంటర్‌టైనర్‌లోరాజేంద్రస్రాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించారు. ఇప్పుడు పాటల చిత్రీకరణ జరుగుతోంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.