నిద్రలేని రాత్రులు గడిపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను శైలజ’ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు కిశోర్ తిరుమల తాజాగా మళ్లీ రామ్‌తో కలిసి ‘ఉన్నది ఒకటే జిందగీ’తో ముందుకు రానున్నారు. ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్ తిరుమల చెప్పిన విశేషాలు...
సింపుల్ పాయింట్
నేను ప్రతి సినిమా మొదటి సినిమాలాగే ఫీల్ అవుతాను. నన్ను నేను నిరూపించుకోవాల్సింది ఇంకా చాలా వుంది. విడుదల దగ్గర పడడంతో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఈ కథను ఏడాది క్రితం రాసాను. రామ్ ‘హైపర్’ సినిమా చేస్తున్న సమయంలో కథ వినిపించడం జరిగింది. స్నేహం, ప్రేమ మీద నేను అనుకున్న సింపుల్ పాయింట్‌ను ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కించాను.
రామ్ పాత్ర..
రామ్ పాత్ర ఈ సినిమాలో చాలా సరదాగా వుంటుంది. రెండు విభిన్న లుక్స్‌లో రామ్ కనిపించబోతున్నాడు. రామ్ పాత్రకు న్యాయం చేశాడు. అతని నటన సినిమాకు ప్రధాన బలం కానుంది. అలాగే అనుపమ పరమేశ్వరన్ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఖాయం. చాలా లలీ పాత్ర పోషించింది. తన పాత్రకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. రామ్‌తో తన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. విష్ణు ఈ సినిమాలో హీరోకు ఏ మాత్రం తగ్గని పాత్రలో కనిపిస్తారు. నాకు మంచి మిత్రుడు కూడా. ఎటువంటి సందేహం లేకుండా తను ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నాడు.
అన్ని రకాల ఎమోషన్స్
ఈ సినిమాలో ముఖ్యంగా స్నేహం ప్రేమ గురించి ఉన్నా కూడా అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది.
వెంకటేష్‌తో..
ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ పెండింగ్‌లో వుంది. నానితో ఒక సినిమా చర్చల్లో వుంది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా విడుదల తరువాత నిర్ణయం తీసుకుంటా.

- శ్రీ