మీకు...మాకు పాటల విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తరుణ్‌శెట్టి, అవంతికా జంటగా నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘మీకు మీరే..మాకు మేమే..’ ఈ చిత్రానికి సంబంధించిన పాటల సీడీని హైదరాబాద్‌లో అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు చేసిన లఘు చిత్రాలను చూసి ఆశ్చర్యపోయి తనకు ఓ చిత్రం చేయమని అడిగానని, ఉద్యోగం వదిలేసి సినిమాపై ఆసక్తితో ఆయన వచ్చారని తెలిపారు. సుకుమార్ దగ్గర కొంతకాలం పనిచేసి ఈ చిత్రాన్ని రూపొందించాడని, రషెస్ చూసిన తనకు ఈ సినిమా నచ్చిందని తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తన వద్ద అన్ని విషయాలను దర్శకుడు నేర్చుకున్నాడని, అతని లఘు చిత్రాలు చూసి తాను కూడా ఈర్ష్యగా చూశానని తెలిపారు. అతను మంచి సినిమా తీసివుంటాడని నమ్మకం ఉందని ఆయన అన్నారు. ప్రతి అబ్బాయి కంటే ప్రతి అమ్మాయి మిన్నగా ఆలోచిస్తుందని దర్శకుడు హుస్సేన్ తెలిపారు. రామ్నోహన్ , అవంతిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర విశేషాలు తెలిపారు.