18న శ్రీశ్రీ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, విజయనిర్మల జంటగా ఎస్బీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శ్రీశ్రీ’. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 18న ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణ 50 ఏళ్ల సినిమా కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సినీ స్వర్ణోత్సవ కార్యక్రమం కూడా జరుగనున్నది. ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మహేష్‌బాబు ముఖ్యఅతిథిగా వస్తారని ఓ అర్థవంతమైన సినిమాగా అన్ని వర్గాలకు నచ్చే విధంగా రూపొందిందని సుధీర్‌బాబు క్లైమాక్స్‌లో పోలీసు అధికారిగా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారని తెలిపారు. నరేష్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, ఎల్‌బి శ్రీరామ్, తోటపల్లి మధు, దేవదాస్ కనకాల, మురళీశర్మ, కునాల్ కౌసిక్, అనితా చౌదరి, సోఫియా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు : రామ్ కంకిపాట, కథ : రమేష్ డియే, సంగీతం : ఈ.ఎస్. మూర్తి, కెమెరా: సతీష్ ముత్యాల, ఎడిటింగ్ : రమేష్, నిర్మాతలు: సాయిదీప్ చాట్ల, వై. బాలురెడ్డి, షేక్ షిరాజ్, స్క్రీన్‌ప్లే దర్శకత్వం : ముప్పలనేని శివ.