దర్శకుడు ఐ.వి శశి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ‘తృషణ్’ సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు ఐ.వి శశి (69) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, దారిలోనే తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. మలయాళ చిత్రసీమలో ఎన్నో మరపురాని చిత్రాలు ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్నాయి. ఒక్క మలయాళ భాషలోనే ఆయన 150 చిత్రాలను తెరకెక్కించారు. తమిళ, హిందీ భాషల్లో కూడా ఆయన రూపొందించిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. శశి దర్శకత్వంలో రూపొందిన ‘అవులుడే రావుకల్’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మలయాళంలో ‘ఎ’ సర్ట్ఫికెట్ అందుకున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు, ప్రఖ్యాత నటుడు మోహన్‌లాల్ కెరీర్‌లో భారీ విజయాలను అందుకున్న చిత్రాల్లో ఎక్కువ ఈయన రూపొందించినవే. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్‌తో కూడా ఆయన చిత్రాలు తెరకెక్కించారు. రజనీని మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కూడా ఈయనే కావడం విశేషం. రజనీకాంత్ కెరీర్‌లోనే మరపురాని చిత్రమేన ‘కాళి’ చిత్రాన్ని రూపొందించింది కూడా ఈయనే. కాగా, ‘అవులుడే రావుకల్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సీమను శశి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 28 మార్చి 1948లో జన్మించిన ఈయన 27 ఏళ్ల వయస్సులోనే దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఉల్సవం’. ఆ తర్వాత ఆయన ‘అనుభవం’, ‘1921’, ‘ఈట’, ‘మరిగయ’ ‘బలరాం వర్సెస్ థారాదాస్’ తదితర చిత్రాలు ఆయనకు ఎనలేని గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఈయన ప్రతిభను గౌరవిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులను అందజేశాయి. 1982లో జాతీయ అవార్డును అందుకున్న ఈయనకు 2015లో కేరళ ప్రభుత్వం జేసీ డేనియల్ అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. మలయాళ చిత్రసీమలో గొప్ప వ్యక్తి ఐ.వి శశి. ఆయన చిత్రపరిశ్రమకు చేసిన సేవలు మరచిపోలేనివి అని ఆయన అన్నారు. కమల్‌హాసన్, రాధిక, జయం రవి తదితరులు దర్శకుడు శశి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని ట్వీట్ల ద్వారా వ్యక్తం చేశారు. ‘గత నలభై ఐదేళ్లుగా నా స్నేహితుడు ఐ.వి శశి ఇకలేడు అంటేనే ఎంతో బాధగా వుంది. గొప్ప టెక్నీషియన్‌ను కోల్పోయాం. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. నా సోదరి ఐ.వి శశి సతీమణి సీమా, మిగిలిన కుటుంబ సభ్యులకు నా సానుభూతి, ఆదరణ ఎప్పుడూ ఉంటుంది’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. ‘దర్శకుడు ఐ.వి శశి మృతి చాలా బాధించింది. గొప్ప దర్శకుడితో కలిసి పనిచేయడం మరచిపోలేనిది’ అని నటి రాధిక సంతాపాన్ని వ్యక్తం చేశారు.