జీవితం క్లిష్టతరం చేసుకుంటున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రామ్, సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఆయన సినిమాల ఎంపిక ఉంటుంది. ‘నేను శైలజ’ వంటి సంచలన విజయం తరువాత రామ్ మళ్లీ కిశోర్ తిరుమలతో చేసిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. స్రవంతి మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా హీరో రామ్‌తో ఇంటర్వ్యూ...

* లవ్ ఫెయిల్యూర్ గురించిన కథా ఇది?

- అలా అని కాదు కానీ జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్ని చూపించే ప్రయత్నం చేశాం. చివరగా అక్కడికే వస్తుంది. ఇందులో మూడు దశల జీవితాన్ని చూపించాం. చిన్నప్పుడు, కాలేజీ, ఆ తరువాత కథ సాగుతుంది.

* ఈ సినిమాకు గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు?

- ‘హైపర్’ తరువాత కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. దానికి కారణం చాలా కథలు విన్నాను. రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్తగా వెళ్దామనే అనుకున్నాను. లక్కీగా అలాంటి కథ దొరికింది.

* ఇది ప్రేమ, లేక స్నేహితుల కథా?

- ఖచ్చితంగా స్నేహితుల కథే. అందులో ప్రేమ కూడా వుంటుంది. ట్రైలర్‌లో చెప్పినట్లు మన జీవితంలో ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ వుంటాడు. కొన్ని సమయాల్లో అతను ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి విషయాలే ఈ సినిమా.

* మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?

- శరత్ అని చెన్నైలో వుంటాడు. తను డాక్టర్.

* సినిమాతో ఏం చెబుతున్నారు?

- మన జీవితం అనేది చాలా సింపులే కానీ దాన్ని మనం కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం.

* ఇందులో మీ పాత్ర?
- నేను ఇందులో రాక్‌స్టార్‌ను కాదు. కాలేజీ డేస్‌లో మాత్రం రాక్ బ్రాండ్‌ను టీమ్‌ను లీడ్ చేసేవాడిని. దానికోసం గిటార్ కూడా నేర్చుకున్నాను.

* లుక్ కూడా కొత్తగా ట్రై చేశారు?

- ఇది సినిమా కోసం చేసింది కాదు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నపుడు ఇలా కుదిరింది. దాన్ని సినిమా కోసం వాడాం. రాక్‌స్టార్ అంటే జనరల్‌గా మోడరన్ లుక్‌లో వుంటారు కదా!

* మళ్లీ కిశోర్‌తో పనిచేయడం ఎలా వుంది?

- కిశోర్ మంచి కమిట్‌మెంట్ వున్న వ్యక్తి. నేను శైలజ సమయంలో అతని వర్క్ డెడికేషన్ తెలుసు కాబట్టి ఈ సినిమా మొత్తం ఆయన చేతుల్లోనే పెట్టేశాం. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుని సినిమా చేశాడు.

* హీరోయిన్ల గురించి?

- ఇందులో అనుపమా, లావణ్య ఇద్దరి పాత్రలూ అద్భుతంగా వుంటాయి. ముఖ్యంగా అనుపమ మహా అనే పాత్రలో చేసింది. తన నిజ జీవితానికి ఈ పాత్రకు పూర్తి రివర్స్‌లో వుంటుంది. లావణ్య మోడరన్ గాళ్‌గా కనిపిస్తుంది.

* దేవిశ్రీ సంగీతం గురించి?

- దేవితో ఇది నా ఐదవ చిత్రం. ఐదు సినిమాల సంగీతం సూపర్‌హిట్ అయ్యాయి. తను కథ విన్న తరువాత ఏ సిట్యుయేషన్‌కు ఎలాంటి పాట ఇవ్వాలో బాగా తెలుసు. తనతో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంటుంది.

* ప్రస్తుతం యువ హీరోలు ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మీరు ఆ ప్రయత్నం చేయరా?

- తప్పకుండా చేస్తా. అయితే ద్విభాషా చిత్రం చేయడం కష్టం. ఎందుకంటే మనకు నచ్చిన ఎలిమెంట్స్ తమిళ వాళ్లకు నచ్చవు. అక్కడి పరిస్థితులు, మన పరిస్థితులు వేరు. మంచి కథ వస్తే తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తా.

* తదుపరి చిత్రాలు?

- ప్రస్తుతానికి కథలైతే వింటున్నాను. త్వరలోనే ప్రకటిస్తా.

-శ్రీనివాస్ ఆర్.రావ్