పాటల్లో ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, అను ఇమ్మాన్యుయేల్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ‘ఆక్సిజన్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సీడీని ప్రముఖ నటుడు శరత్‌కుమార్ ఆవిష్కరించారు. అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ- ఈ సినిమాలో నేను నటించడానికి ముఖ్య కారణం రత్నం. ఎందుకంటే నా చిన్నప్పటినుంచి నాన్న దగ్గర ఆయన్ను చూశాను. నిర్మాతగా మారి తపన వున్న వ్యక్తిగా ఎదిగారు. జ్యోతికృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో సినిమా చేస్తానని ఆయనకు మాట ఇచ్చాను. జ్యోతికృష్ణ అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రత్నం కేర్ తీసుకున్నాడు. కమర్షియల్ విలువలతోపాటు మంచి సందేశం వున్న చిత్రమిది అన్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ- గోపీచంద్‌కు ఒకేసారి రెండు కథలు వినిపించాను. ఆయనకు ఈ కథ నచ్చింది. గోపీ పాత్ర మూడు వేరియేషన్స్‌లో వుంటుంది. చాలా హార్డ్‌వర్క్ చేశాడు. అలాగే మా టీమ్ ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాం అన్నారు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ- నేను సైన్ చేసి మొదటి సినిమా ఇది. తెలుగు రాకపోయినా జ్యోతికృష్ణ, ఐశ్వర్య నాపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టానని అనుకుంటున్నాను. గోపీచంద్ ఎంతో సపోర్టు అందించారు అన్నారు. ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ- సినిమా అద్భుతంగా వచ్చింది. మాకు సపోర్టు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.