పాత్రలే ప్రధానంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశ్వంత్ మూవీస్ సమర్పణలో పూజ రామచంద్రన్, భూపాల్‌రాజ్, మనోజ్‌నందం, ధన్‌రాజ్ ముఖ్యపాత్రల్లో శ్రీకిశోర్ దర్శకత్వంలో ఆర్.ఓ క్రియేషన్స్ బ్యానర్‌పై డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోశ్ నిర్మిస్తున్న ‘దేవిశ్రీప్రసాద్’ చిత్రం నవంబర్ 10న విడుదలవుతున్న సందర్భంగా హీరో మనోజ్ నందం చెప్పిన విశేషాలు.. సినిమా పూర్తయ్యింది. కొన్ని చిన్న చిన్న సమస్యలవల్ల సినిమా ఆలస్యంగా విడుదలవుతోంది. ఆ సమయంలో నిర్మాత వెంకటేష్ ఈ చిత్రాన్ని చూసి విడుదలకు సహకరించాడు. కమర్షియల్ యాంగిల్‌లో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదొక భిన్నమైన కథ. ఈ తరహా సినిమా తెలుగులో తొలిసారి వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పాత్రలే ప్రధానంగా సాగే కథ ఇది. కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు శ్రీకిశోర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇదొక కల్ట్ మూవీ. నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా ఆడియో కూడా అద్భుతంగా వచ్చింది. ఇందులో ప్రసాద్ అనే పాజిటివ్ యువకుడిగా కన్పిస్తాను. భూపాల్ చేసిన పాత్ర పూర్తిగా నెగెటివ్‌గా వుంటుంది. చూసే ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ను కలిగించే చిత్రమిది. ఈ సినిమాతోపాటు నేను నటించిన మనసైనోడు కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే వీరభోగ వసంతరాయలు చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నాను అన్నారు.