భయపెట్టే గృహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మిలిందర్‌రావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘గృహం’. హీరో సిద్ధార్థ్, ఆండ్రియా ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ- హారర్ చిత్రాలలో వైవిధ్యంగా వుండాలని ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రేక్షకులు ఎక్కడ భయపడతారు అనే విషయాలను అనేకమందిని గమనించి ఈ సినిమా రూపొందించామని, దాదాపు నాలుగున్నరేళ్లపాటు స్క్రిప్ట్ కార్యక్రమాలు జరిపామని, ఒక డాక్టర్ తన భార్యతో కలిసి హిమాచల్‌ప్రదేశ్ వెళితే, అక్కడ మరో కుటుంబంలో వున్న ఓ అమ్మాయి కారణంగా ఎదురయ్యే సమస్యలు ఈ చిత్రంలో వైవిధ్యంగా చిత్రీకరించామని తెలిపారు. సినిమాను చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్‌కు గురవుతారని, భయానికి భాష అవసరం లేదు కనుక తెలుగు, తమిళ, హిందీ భాషలలో నవంబర్ 3న సినిమాను విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు.