విదేశాల్లో విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ఈమధ్యకాలంలో అందరికంటే ముందు దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసిన ఈ భామకు ఈమధ్య వరుస షెడ్యూల్స్‌తో బిజీగా మారిందని, రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరకడంలేదని తెగ ఫీల్ అవుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలతో, ఇటు యువ హీరోలతో జోరుగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు నిజంగా బ్రేక్ లేకుండా షూటింగ్‌లతో బిజీగా మారింది. 2014 నుండి కెరీర్ మొదలుపెట్టిన రకుల్‌కు అసలు హాలీడేస్ అనేది లేకుండా రెగ్యులర్ షూటింగ్‌లతో బిజీగా మారిన ఈ భామకు ఇప్పుడు హాలీడేస్ వచ్చేసాయట. అందుకే ఫ్యామిలితో కలిసి విదేశాల్లో విహారం చేస్తోంది? సినిమా తారలు వరుస షూటింగ్‌లతో బిజీగా వున్న సమయంలో ఏ మాత్రం ఖాళీ దొరికినా రిప్రెష్ అవ్వడానికి విదేశాలకు వెళుతున్న విషయం తెలిసిందే. కొందరు ఫ్రెండ్స్‌తో వెళితే మరికొందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు రకుల్ కూడా ఫ్యామిలీతో కలిసి హాలిడేస్‌ని జాలీగా తెగ ఎంజాయ్ చేస్తోంది మరి. ఇప్పటికే తమిళ్‌లో సూర్య, కార్తీక్‌ల సినిమాలతోపాటు ఇక్కడ మూడు సినిమాలు చేసింది రకుల్.