వంగవీటి తరువాత తెలుగు సినిమా తీయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ రియల్ లైఫ్‌స్టోరీలు, వివాదాస్పద చరిత్రలను తెరకెక్కించడంలో దిట్ట. ఎవరూ టచ్ చేయని నేపథ్యాలతో సినిమాలు తీసి, వివాదాలు సృష్టించడంలో ఆయనే ముందుంటాడు. గతంలో పరిటాల రవి జీవితంపై ‘రక్తచరిత్ర’ సినిమా తీసి, సక్సెస్ అయిన వర్మ ఇటీవలే వీరప్పన్ జీవిత కథతో ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా మరో సంచలన చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. విజయవాడలో రాజకీయ నాయకుడిగా పలుకుబడి వున్న వంగవీటి రంగా హత్యోదంతం, జీవితంపై సినిమా చేయడానికి రెడీ అయ్యా డు. ‘వంగవీటి’ పేరుతో తెరకెక్కే ఈ సినిమా ఇప్పటికే సంచలనాన్ని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత ఇక తెలుగులో వర్మ సినిమాలు చేయనని స్పష్టం చేశారు. వంగవీటి సినిమా తర్వాత తాను తెలుగులో సినిమాలు చేయనని ప్రకటించేశారు కూడా. అయితే ఇలాంటి ప్రకటనలు చేయడం ఆయనకు కొత్త ఏమీ కాదు. గతంలో ‘గోవింద.. గోవింద’ సినిమా సమయంలో కూడా సెన్సార్ వాళ్లపై ఫైర్ అయిన వర్మ ఇక సినిమాలు తీయనని ప్రకటించి ముంబాయి వెళ్లిపోయారు. ఆ తర్వాత హిందీలో పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలను తీసి మళ్లీ ‘అనగనగా ఒకరోజు’ సినిమాతో తెలుగులో సినిమాలు చేయడం ప్రారంభించారు. ‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అయినా నిజంగా పుట్టింది విజయవాడలోనే. నాకు అవగాహన తెలిసిన బంధాలు, ప్రేమలు, పగలు వీటన్నిటి గురించి తెలిసింది విజయవాడలోనే. రౌడీయిజం బ్యాక్‌డ్రాప్‌లో తీయబోతున్న వంగవీటి చిత్రం పగకి, ఆవేశానికి ఉన్న తేడాను చూపిస్తుంది. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30ఏళ్ల క్రితం విజయవాడలో చూశాను. అందుకనే విజయవాడలో రౌడీయిజం గురించి నాకన్నా తెలిసినవాడు ఎవరూలేరు. అందుకనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’ అంటూ వర్మ చెబుతున్నారు.