సైబర్ క్రైమ్‌తో కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, నిక్కీగల్రానీ, అనై కా సోఠి ప్రధాన తారాగణంగా కృష్ణ క్రియేషన్స్ లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై రూపొందించిన చి త్రం ‘కీ’. ఈ చిత్రం తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఖలీస్ చిత్ర విశేషాలు తెలుపుతూ- సైబర్ క్రైమ్ నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. రెండు వైపులా పదునైన కత్తిలా వున్న సాంకేతిక విజ్ఞానాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని, రోజురోజుకూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఉపయోగంతోపాటు నష్టం కూడా ఉందని తెలిపారు. కంప్యూటర్‌లను హ్యాక్ చేసి ఎదుటివారిని బెదిరించి, తమ ప్రాణాలు తాము తీసుకునేలా బ్లూవేల్ ఆటలు లాంటి విషయాలు మనం నిత్యం చదువుతూనే వున్నామని, ఇలాంటి ప్రమాదకరమైన సాంకేతికతను విద్రోహులు ఎలా ఉపయోగిస్తున్నారు అన్న కథనంతో ఈ చిత్రం రూపొందించామని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా 1.5 మిలియన్ వ్యూస్‌ను రాబట్టిందని, టెక్నాలజీలో మరోకోణాన్ని టచ్ చేస్తూ కీ సినిమాను రూపొందించామని, త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. రాజేంద్రప్రసాద్, సుహాసిని తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం:ఖలీస్.