షకలక రాముడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరామారావు నటించిన ‘డ్రైవర్‌రాముడు’ గుర్తొస్తే మంచి మంచి పాటలు గుర్తొస్తాయి. అదే పేరుతో దర్శకుడు రాజ్‌సత్య ‘జబర్దస్త్’ ఫేమ్ షకలక శంకర్‌ను కథానాయకుడిగా చేసి రూపొందించిన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ పతాకంపై ఎం.ఎల్.రాజు, ఎస్.ఆర్.కిషన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘డ్రైవర్‌రాముడు’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ- ‘కమెడియన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న షకలక శంకర్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. షకలక శంకర్‌లో మరో కొత్తకోణం ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నాం. శంకర్ టైప్ కామెడీతోనే సాగుతూ మంచి కథనం, ఎమోషన్‌లతో ఈ సినిమా సాగుతుంది. శంకర్ ఓ కొత్త లుక్‌తో కనిపించే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. ‘డ్రైవర్‌రాముడు’ వంటి బ్లాక్‌బస్టర్ టైటిల్‌తో తాము రూపొందిస్తున్న ఈ సినిమాతో శంకర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. శంకర్ మార్క్ కామెడీతో ప్రేక్షకులను నూటికి నూరు శాతం ఆకట్టుకుంటాడు’ అని ఆయన అన్నారు. ‘కమెడియన్‌గా ఆశీర్వదించిన నన్ను హీరోగా కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ చిత్రంలో నటించాను. నా కామెడీ టైమింగ్ మిస్ కాకుండా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్వించేలా ఈ సినిమా తెరకెక్కింది’ అని హీరో షకలక శంకర్ తెలిపారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి దర్శకత్వం: రాజ్ సత్య.