3న ఏంజెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ అనే్వష్, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాజవౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకుడు. ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి నిర్మాత. నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు చెబుతూ- సినిమా వ్యవధి రెండు గంటల ఎనిమిది నిమిషాలు. ఇటీవలే యూనిట్ అంతా సినిమా చూశాం. సంతోషంగా అనిపించింది. సినిమా ఫీల్డ్‌లో చేసిన పనిని స్క్రీన్‌పైనే చూస్తే ఆనందమే వేరుగా వుంటుంది. దానే్న ఫ్యాషన్ అంటారు. అప్రిసియేట్ చేశారు. నాగ అనే్వష్ డ్యాన్సులు, ఫైట్స్, స్క్రీన్ ప్రెజన్స్ చూసి తను తొందరలోనే తెలుగులో టాప్ స్టార్స్‌లో ఒకడు అవుతాడనిపించింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్సియల్ స్టేటస్ కాస్త ఇబ్బందిగానే వుంది. అయినా మేం అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని ప్రిపేర్ అయ్యాం. సినిమా బిజినెస్ చూసిన తర్వాత నిర్మాతగా నమ్మకం కలిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తాం. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు వెర్షన్స్‌లో సినిమాను వారం లేదా రెండు వారాల తర్వాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.