బాలకృష్ణ ‘జై సింహ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ చిత్రానికి ‘జై సింహ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత సి.కల్యాణ్ సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ వివరాలు తెలియజేస్తూ- సెనే్సషనల్ దర్శకుడు రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణతో ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం ఆనందంగా వుంది. ఈ చిత్రానికి ‘జై సింహ’ అనే టైటిల్‌ను ఎంపిక చేశాం. నవంబర్ 1న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వైజాగ్‌లోని బీచ్ రోడ్‌లో 5వేలమంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో మహాధర్నా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దాంతోపాటు బాలకృష్ణ హరిప్రియలపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను, అలాగే బాలకృష్ణపై మాంటెజ్ సాంగ్‌ను తెరకెక్కిస్తాం. బాలకృష్ణ కెరీర్‌లో సింహ అనే పేరు వచ్చిన సినిమాలన్నీ సంచలన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో జై సింహ కూడా సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:రాంప్రసాద్, సంగీతం:చిరంతన్ భట్, సహ నిర్మాత:సి.వి.రావు, నిర్మాణం:సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, దర్శకత్వం:కె.ఎస్.రవికుమార్.