పాట చిత్రీకరణలో కొబ్బరి మట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపూర్ణేష్ బాబు, ఇషికాసింగ్, గీతాంజలి హీరోహీరోయిన్లుగా రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, సంజనా మూవీస్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్లపై సాయి రాజేష్, ఆది, కుంభగిరి నిర్మిస్తున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ మళ్లీ మిమ్మల్ని అలరించేందుకు త్వరలో మీముందుకు వస్తున్నాం. ఇందులో మూడు పాత్రల్లో నటిస్తున్నాను, ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరుగుతోంది అన్నారు.
దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్ మాట్లాడుతూ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. మూడు రోజులపాటు జరిగే షూటింగ్‌తో పాట పూర్తవుతుంది. సంపూర్ణేష్ డాన్సులు కూడా అదరగొడుతున్నాడు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో సంపూర్ణేష్ మూడు పాత్రల్లో అద్భుతాన్ని ఆవిష్కరించనున్నాడన్నారు. ఈ చిత్రానికి కథ: స్టీవెన్ శంకర్, సంగీతం: కమ్రాన్, నిర్మాతలు: సాయి రాజేష్, ఆది కుంభగిరి, దర్శకత్వం: రూపక్ రోనాల్డ్‌సన్.